Antarvedi: వలకు చిక్కిన ‘బంగారు చేప’.. 25 కేజీల కచిడికి రూ.2 లక్షల ధర!

Antarvedi: అంతర్వేదిలో అరుదైన కచిడి చేప. వలకు చిక్కిన 25 కేజీల చేపను రూ. 2 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారి. మత్స్యకారుల్లో పండుగ వాతావరణం.

PRABHU, RAZOLE
Published on: 23 Jun 2026 12:50 PM IST
Antarvedi
X

Antarvedi: వలకు చిక్కిన ‘బంగారు చేప’.. 25 కేజీల కచిడికి రూ.2 లక్షల ధర!

అంతర్వేది : డాక్టర్.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో అరుదైన భారీ కచిడి చేప మత్స్యకారుల వలకు చిక్కి అందరి దృష్టిని ఆకర్షించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు 25 కిలోల బరువున్న మగ కచిడి చేప చిక్కడంతో హార్బర్ వద్ద సందడి నెలకొంది.

అరుదుగా లభించే ఈ చేపను హార్బర్‌లో వేలం వేయగా, పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి ఏకంగా రూ.2 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

స్థానిక మత్స్యకారుల కథనం ప్రకారం, కచిడి చేప పొట్ట భాగాన్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటికి మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. రెండు నెలల వేట విరామం అనంతరం ఇలాంటి విలువైన చేప వలకు చిక్కడం శుభ సూచకమని వారు ఆనందం వ్యక్తం చేశారు.

భారీ కచిడి చేపను చూసేందుకు హార్బర్‌కు స్థానికులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేప వేలం, దాని ధర ప్రస్తుతం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story