Razole: రాజోలులో 'పెద్ది' మూవీ భద్రత కట్టుదిట్టం
Razole: బెనిఫిట్ షోలు, తొలిరోజు ప్రదర్శనలపై సీఐ వి. సురేష్ బాబు ఆంక్షలు. బైక్ ర్యాలీలు, బాణాసంచా పేలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.
Razole: రాజోలులో 'పెద్ది' మూవీ భద్రత కట్టుదిట్టం
రాజోలు: రాజోలు సర్కిల్ పరిధిలో విడుదల కానున్న ‘పెద్ది’ సినిమా బెనిఫిట్ షో మరియు తొలి రోజు ప్రదర్శనల సందర్భంగా అభిమానులు, యువత శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని రాజోలు సీఐ వి. సురేష్ బాబు సూచించారు. సినిమా ప్రదర్శనల సందర్భంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా అభిమాన సంఘాల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
థియేటర్ల వద్ద అధిక శబ్దాలతో సైలెన్సర్లు తొలగించిన వాహనాలతో ర్యాలీలు నిర్వహించడం, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రమాదకర విన్యాసాలు చేయడం, బాణాసంచా పేల్చడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే థియేటర్ల వద్ద భారీ గుమిగూడింపులు, తోపులాటలు జరగకుండా అభిమాన సంఘాల నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తులకు హాని కలిగించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సినిమాను ఆనందంగా వీక్షిస్తూ, శాంతి భద్రతలకు సహకరించాలని సీఐ వి. సురేష్ బాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు.




