Razole: మై భారత్ కోనసీమ ఆధ్వర్యంలో రాజోలులో స్వచ్ఛత పఖ్వాడా 2026 విజయవంతం!

Razole: క్రీడల మంత్రిత్వ శాఖ ‘MY BHARAT’ కోనసీమ ఆధ్వర్యంలో రాజోలు కాటన్ పార్క్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 13 Aug 2026 3:09 PM IST
Razole
X

Razole: మై భారత్ కోనసీమ ఆధ్వర్యంలో రాజోలులో స్వచ్ఛత పఖ్వాడా 2026 విజయవంతం!

Razole: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని MY BHARAT – కోనసీమ (ఏపీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “స్వచ్ఛత పఖ్వాడా–2026” కార్యక్రమంలో భాగంగా రాజోలు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం గోదావరి గట్టున ఉన్న కాటన్ పార్క్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్క్ పరిసరాలను శుభ్రం చేసి, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలను స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛతపై అవగాహన, తడి–పొడి వ్యర్థాలను వేరు చేయడంపై ప్రచారం, పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

“క్లీన్ ఇండియా–గ్రీన్ ఇండియా–హెల్తీ ఇండియా” సందేశంతో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.

స్వచ్ఛతను కేవలం కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా మార్చేందుకు యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు నల్లి రాజు, ఎం. సరితతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story