Razole: రాజోలులో కుటుంబ కలహం - దారుణంగా భార్యపై భర్త చాకుతో దాడి

Razole: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఘోరం చోటుచేసుకుంది.

PRABHU, RAZOLE
Published on: 24 Jun 2026 9:27 AM IST
Razole
X

Razole: రాజోలులో కుటుంబ కలహం - దారుణంగా భార్యపై భర్త చాకుతో దాడి

Razole: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు కుక్కలవారి పేటలో ఘటన. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న తాడి లక్ష్మీదుర్గ (33) - ప్రకాశరావు దంపతులు. కొంతకాలంగా దంపతుల మధ్య కొనసాగుతున్న కుటుంబ విభేదాలు. మంగళవారం రాత్రి మరోసారి తీవ్ర వాగ్వాదానికి దిగిన భార్యాభర్తలు.

మాటామాటా పెరిగి ఘర్షణగా మారిన కుటుంబ వివాదం. ఆవేశానికి లోనైన భర్త ప్రకాశరావు చాకుతో దాడి చేసినట్లు సమాచారం. దాడిలో లక్ష్మీ దుర్గ శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని గుర్తించిన స్థానికులు వెంటనే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలింపు. ఘటన అనంతరం భర్త స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. 12 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి సంఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్న రాజోలు పోలీసులు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story