Razole: రాజోలులో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ!

Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో గణేష్ లడ్డూ వేలంపాట రికార్డు ధర. భక్తుడు యెరుబండి శ్రీగణేష్ రూ.4,50,100 భారీ ధరకు లడ్డూ సొంతం.

PRABHU, RAZOLE
Published on: 22 Sept 2026 9:20 AM IST
Razole
X

Razole: రాజోలులో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డూ!

Razole: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు కోళ్లవారి వీధిలో గణేశ్ లడ్డూ వేలంపాట రికార్డు ధర పలికింది. ఎస్వీకే యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం రాత్రి నిర్వహించిన లడ్డూ వేలంపాట భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో రాజోలుకు చెందిన భక్తుడు యెరుబండి శ్రీగణేశ్ రూ.4,50,100 భారీ ధరకు లడ్డూను దక్కించుకున్నారు.

వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనగా, చివరకు శ్రీగణేశ్ అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యెరుబండి శ్రీగణేశ్‌ను ఘనంగా సత్కరించి, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. గణేశ్ లడ్డూను దక్కించుకున్న శ్రీగణేశ్‌కు స్థానికులు, భక్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సందడిగా సాగింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE