Razole: ఆర్చరీ పోటీల్లో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల సత్తా!

Razole: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన అంతర్ కళాశాల ఆర్చరీ పోటీల్లో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు బంగారు, వెండి పతకాలు సాధించారు.

PRABHU, RAZOLE
Published on: 20 Nov 2026 1:10 PM IST
Razole
X

Razole: ఆర్చరీ పోటీల్లో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల సత్తా!

రాజోలు: అంతర్ కళాశాల ఆర్చరీ పోటీల్లో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు, వెండి పతకాలు సాధించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని సూర్యారాయ డిగ్రీ కళాశాలలో నవంబర్ 18న నిర్వహించిన అంతర్ కళాశాల ఆర్చరీ పోటీల్లో రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రతిభ చాటుకున్నారు. కళాశాలలో బీఎస్సీ చదువుతున్న A.V.T. యజ్ఞేశ్వరి బంగారు పతకం సాధించగా, బీఎస్సీ మొదటి సంవత్సరం గణితశాస్త్ర విద్యార్థిని K. చాందిని వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ P. సాయిబాబు విజేత విద్యార్థినులను అభినందించారు. క్రీడారంగంలో విద్యార్థులు సాధిస్తున్న విజయాలు కళాశాల ప్రతిష్ఠను మరింత పెంచుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్చరీ కోచ్ J.N.S. గోపాలకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ B. మధుకుమార్, శ్రీ నరసింహరాజు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE