Razole: చైతన్య కళాశాలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

Razole: రాజోలు చైతన్య జూనియర్ కళాశాలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. సరైన చికిత్సతో వ్యాధిని నియంత్రించవచ్చని ఐసీటీసీ కౌన్సిలర్ ప్రతాప్ కుమార్ వెల్లడి.

PRABHU, RAZOLE
Published on: 3 Sept 2026 11:57 PM IST
Razole
X

Razole: చైతన్య కళాశాలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు

రాజోలు: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమిష్టి అవగాహనతో పాటు సరైన చికిత్స ద్వారా హెచ్‌ఐవీని నియంత్రించవచ్చని ఐసీటీసీ కౌన్సిలర్ వి. ప్రతాప్ కుమార్ అన్నారు.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు లోని చైతన్య జూనియర్ కళాశాలలో జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, చేంజెస్ సీఎస్‌సీ ప్రాజెక్ట్స్ సంయుక్త భాగస్వామ్యంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ నిర్వహించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూచనల మేరకు దిశా (డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్‌ఐవీ/ఎయిడ్స్) ఆధ్వర్యంలో, స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ఐసీటీసీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

కళాశాల ప్రిన్సిపాల్స్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ వి. ప్రతాప్ కుమార్ పాల్గొని విద్యార్థులకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఏపీసాక్స్ ముద్రించిన ఐఈసీ మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల ప్రిన్సిపాల్స్, జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, చేంజెస్ సిబ్బంది కే. శ్రీనివాస్, వై. షణ్ముఖ్, రాజ్యలక్ష్మి, అధ్యాపకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story