Razole: పవన్ కళ్యాణ్ బర్త్డే రాజోలులో ఘనంగా రక్తదాన శిబిరాలు!
Razole: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాజోలు నియోజకవర్గంలో 200 మందికి పైగా రక్తదానం. కడలి, లక్కవరం గ్రామాల్లో సేవా కార్యక్రమాలు.
Razole: పవన్ కళ్యాణ్ బర్త్డే రాజోలులో ఘనంగా రక్తదాన శిబిరాలు!
Razole: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
కడలి, లక్కవరం గ్రామాల్లో చిరు పవన్ చరణ్ సేవా సమితి, మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు స్థానిక యువత, మెగా అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. రెండు గ్రామాల్లో కలిపి 200 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
మెగా యూత్ ఫోర్స్ రాజోలు మండల అధ్యక్షుడు ముత్యాల సత్తిబాబు, మలికిపురం మండలానికి చెందిన బోనం చంటి నాయుడు రక్తదాన శిబిరాలను పర్యవేక్షించారు.
ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసే రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలను నిర్వహించడం ఆదర్శనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిబిరాల్లో పాల్గొన్న రక్తదాతలను స్థానిక ప్రముఖులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు అభినందించారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.




