Razole: జనసేన ఖాతాలో తొలి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం!

Razole: రాజోలు నియోజకవర్గంలో జనసేన తొలి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం. బట్టేలంక-ఇరుసుమండ నుంచి వలవల వెంకట మణికంఠ ఏకగ్రీవంగా గెలుపొందడంతో జనసేన శ్రేణుల సంబరాలు.

PRABHU, RAZOLE
Published on: 27 Oct 2026 7:18 PM IST
Razole
X

Razole: జనసేన ఖాతాలో తొలి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం!

రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో స్థానిక ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మలికిపురం మండలం బట్టేలంక - ఇరుసుమండ నుంచి కూటమి భాగస్వామ్యంతో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వలవల వెంకట మణికంఠ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఈ స్థానం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఇక రాజోలు మండలంలోని 20 స్థానాలకు వైసీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి 10 మంది, టీడీపీ నుంచి 9 మంది, బీఎస్పీ నుంచి నలుగురు, బీజేపీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు నలుగురు కలిపి మొత్తం 48 మంది బరిలో ఉన్నారు.

సఖినేటిపల్లి మండలంలోని 21 స్థానాలకు వైసీపీ నుంచి 21 మంది, జనసేన నుంచి 13 మంది, టీడీపీ నుంచి 8 మంది, స్వతంత్రులు ఏడుగురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకరు కలిపి మొత్తం 52 మంది పోటీ చేస్తున్నారు.

మలికిపురం మండలంలో ఒక స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన 21 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాలకు వైసీపీ నుంచి 21 మంది, జనసేన నుంచి 8 మంది, టీడీపీ నుంచి 12 మంది, డీఎస్పీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు కలిపి మొత్తం 44 మంది బరిలో ఉన్నారు.

మొత్తంగా రాజోలు నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్న జనసేన శ్రేణులు విజయోత్సాహంలో మునిగిపోయాయి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE