Razole: గొంది గ్రామంలో 127 సెంట్ల భూమిపై వివాదం – కలెక్టర్‌కు ఫిర్యాదు

Razole: రాజోలు నియోజకవర్గం గొంది గ్రామంలో 127 సెంట్ల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్‌కు ఉండపల్లి పద్మజ నిర్మల ఫిర్యాదు.

SURESH, AMALAPURAM
Published on: 24 Aug 2026 2:57 PM IST
Razole
X

Razole: గొంది గ్రామంలో 127 సెంట్ల భూమిపై వివాదం – కలెక్టర్‌కు ఫిర్యాదు

రాజోలు: రాజోలు నియోజకవర్గంలోని సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో 127 సెంట్ల భూమిపై వివాదం.తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితులు కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా ఫిర్యాదు చేశారు.ఉండపల్లి సత్యవతికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణ చేశారు.

అడబాల నాగేశ్వరరావు, నల్లి పెద్దురాజు,ఇంటిపల్లి విజయకుమార్‌పై ఆరోపణలు.పెద్దిరాజు పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదు చేశారు.

సొసైటీ రికార్డుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు.రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదుదారుల ఆరోపణలు చేశారు.భూ వివాదంపై ఇప్పటికే కోర్టులో దావా వేసినట్లు వెల్లడించారు.

జిల్లా కలెక్టర్‌కు డా.ఆర్.మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేసిన ఉండపల్లి పద్మజ నిర్మలా.తమ భూమిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story