Razole: రాజోలులో మెడికల్ షాపులు బంద్: రోడ్డెక్కిన వ్యాపారులు!

Razole: ఆన్‌లైన్ ఫార్మసీ విక్రయాలకు వ్యతిరేకంగా అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు రాజోలు నియోజకవర్గంలో మెడికల్ షాపుల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది.

PRABHU, RAZOLE
Published on: 20 May 2026 1:35 PM IST
Razole
X

Razole: రాజోలులో మెడికల్ షాపులు బంద్: రోడ్డెక్కిన వ్యాపారులు!

Razole: రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది.ఆన్లైన్ ఫార్మసీ అమ్మకాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు రాజోలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద రాజోలు, మామిడికుదురు మండలాల ఫార్మసీ వ్యాపార సంఘాలు నిరసన తెలిపారు. ఆన్లైన్ అమ్మకాలను,కార్పోరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ లను నిలిపివేయాలని,నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసారు. అనంతరం షరతులతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మార్వో కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పోరేట్ సంస్థలు స్ట్రిప్స్ పై ఎం ఆర్ పి ఎక్కువ చూపించి అధిక శాతం డిస్కౌంట్ ఇవ్వడం వల్ల లోకల్ మెడికల్ షాపులకు చాలా నష్టం చేకూరే విధంగా ఉంటుందన్నారు.అలానే నిషేధిత డ్రగ్స్ కూడా ఆన్లైన్ లో విక్రయించడాన్ని పూర్తిగా నిరోధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించకుంటే AIOCD ఆదేశాల మేరకు భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అరవ లక్ష్మణరావు,కాసు శ్రీనివాస్, నూలు మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story