Razole: మెగాస్టార్ చిరంజీవిపై అసభ్యకర పోస్టులు - పోలీసులకు ఫిర్యాదు
Razole: మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై చర్యలు కోరుతూ రాజోలు సీఐకి ఫిర్యాదు చేసిన మెగా యూత్ ఫోర్స్, జనసేన నాయకులు.
Razole: మెగాస్టార్ చిరంజీవిపై అసభ్యకర పోస్టులు - పోలీసులకు ఫిర్యాదు
రాజోలు: మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు ప్రచారం చేయడంపై మెగా అభిమానులు, జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న చిరంజీవిని కించపరిచేలా అసభ్యకర ప్రచారానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కన్వీనర్ కోళ్ల బాబి ఆధ్వర్యంలో మెగా యూత్ ఫోర్స్ సభ్యులు, జనసేన నాయకులు రాజోలు సీఐ సురేష్ బాబును కలిసి ఫిర్యాదు చేశారు. నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి చిరంజీవి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చిరంజీవి తమకు కేవలం సినీ నటుడు మాత్రమే కాదని, కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా, ఆరాధ్యుడిగా నిలిచిన వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం అత్యంత దురుద్దేశపూర్వక చర్యగా అభివర్ణించారు.
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీయడం, తప్పుడు ప్రచారాలు చేయడం, ప్రజల్లో అపోహలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించరాదన్నారు. రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిగత గౌరవాన్ని కించపరచడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
“అభిమానం హద్దులు దాటదు.. కానీ మా ఆరాధ్యుడిని అవమానిస్తే మాత్రం మౌనంగా ఉండేది లేదు” అంటూ మెగా శ్రేణులు ఘాటుగా హెచ్చరించాయి. చిరంజీవిపై అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు ప్రచారం చేసిన వ్యక్తిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాస్, ఉలిశెట్టి లక్ష్మణరావు, తుమ్మలపల్లి నారాయణ, కాట్నం రాజు, దారపురెడ్డి బాబ్జి, రేఖపల్లి శ్రీను, చింతా ప్రసాద్, వడ్లమూడి చిన్ని, కందల చంటి, తుల ఆది, గుండుబోగుల నరసింహ, ముత్యాల సత్తిబాబు, బోనం చంటి నాయుడు, బల్ల చరణ్, వీధి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.




