Malikipuram: రాజోలు 56 మందికి రూ.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Malikipuram: రాజోలు నియోజకవర్గంలో 56 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. బాధితులకు ప్రభుత్వం అండ.
Malikipuram: రాజోలు 56 మందికి రూ.38 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
మలికిపురం: రాజోలు నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ తెలిపారు.
రాజోలు నియోజకవర్గానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.38 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను విశ్వేశ్వరాయపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందించే సహాయం త్వరితగతిన చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు.
గత రెండు సంవత్సరాల్లో ఇప్పటివరకు 31 విడతలుగా సుమారు 1,300 మంది బాధిత కుటుంబాలకు రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు అండగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.




