Sakinipetapalli: చేనేతలకు ఆర్థిక సాయం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Sakinipetapalli: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో నేతన్నలకు రూ. 25 వేల ఆర్థిక సహాయం. హాజరైన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, గొల్లపల్లి అమూల్య.
Sakinipetapalli: చేనేతలకు ఆర్థిక సాయం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
సఖినేటిపల్లి: జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా సఖినేటిపల్లి మండలం వి.వి. మెరక గ్రామం, మలికిపురం మండలం తూర్పుపాలెంలో నిర్వహించిన కార్యక్రమాల్లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన "నేతన్న సేవలో" కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని 751 మంది అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించిందని వెల్లడించారు.
చేనేత రంగాన్ని పరిరక్షించడం, చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం రాజోలు నియోజకవర్గంలోని చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కృషి దేశానికి గర్వకారణమని కొనియాడారు.




