Razole: రాజముద్రతో నూతన పాసు పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ!

Razole: సఖినేటిపల్లి మండలంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రైతులకు పంపిణీ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 4 Aug 2026 5:10 PM IST
Razole
X

Razole: రాజముద్రతో నూతన పాసు పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ!

రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, మోరి మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం వద్ద రీ-సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ రైతులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే ప్రక్రియ ద్వారా భూ రికార్డులను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన రీ-సర్వే వల్ల భూముల సరిహద్దులపై ఉన్న సందిగ్ధత తొలగి, రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు భూమి యాజమాన్యానికి విశ్వసనీయ ధ్రువపత్రాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భూ వివాదాలను తగ్గించడంతో పాటు రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు ఈ పాసు పుస్తకాలు దోహదపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story