Malikipuram: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Malikipuram: మలికిపురం విశ్వేశ్వరాయపురంలో 112 మంది లబ్ధిదారులకు రూ.33.28 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.
Malikipuram: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Malikipuram: మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు కాబడిన రూ.33,28,882/ లక్షల రూపాయల మొత్తాన్ని 112 మంది బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 22 నెలల కాలంలో సుమారు రూ. 8 కోట్ల మొత్తాన్ని 1025 మంది రోగులకు వైద్య సహాయం నిమిత్తం అందించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులను మీరు పొందిన సాయాన్ని ప్రజలకు తెలియచేయాలని,తద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాకారం ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్తుందని, తద్వారా మరికొంత మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అన్నారు. అలాగే కూటమి నాయకులు మరియు గ్రామశాఖలు, గ్రామ కమిటీలు.. లబ్ధిదారులకు మనం చేస్తున్న వైద్యసహాయన్ని గ్రామ ప్రజలలోకి తీసుకెళ్ళాలని సూచించారు.
అనంతరం సాయం పొందిన బాధిత కుటుంబాలు మాట్లాడుతూ.. తమకు సకాలంలో ఈ సాయాన్ని అందించటానికి కృషి చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




