Mamidikuduru: రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

Mamidikuduru: మామిడికుదురు మండలం ఈదరాడలో 796 మంది రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాల పంపిణీ. భూ రికార్డుల్లో పారదర్శకత కోసమే రీ-సర్వే అన్న ఎమ్మెల్యే వరప్రసాద్.

PRABHU, RAZOLE
Published on: 7 July 2026 6:30 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

మామిడికుదురు: డాక్టర్. బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామపంచాయతీ పరిధిలో రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా 796 మంది రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులను శాశ్వతంగా పరిరక్షిస్తూ, భూ రికార్డుల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన కొలతల ఆధారంగా నిర్వహించిన రీ-సర్వే వల్ల భూముల సరిహద్దులపై ఉన్న వివాదాలు, సందిగ్ధతలు తొలగిపోవడంతో పాటు రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు లభిస్తాయని తెలిపారు.

రాజముద్రతో జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు భూ యాజమాన్యానికి చట్టబద్ధమైన ధ్రువీకరణగా నిలుస్తాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు, భూ లావాదేవీలు తదితర అవసరాల కోసం ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. రైతులు తమ భూ రికార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, గ్రామ నాయకులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వీకరించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story