Razole: 51 మందికి రూ.34 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Razole: రాజోలు నియోజకవర్గంలో 51 మంది బాధితులకు రూ.34 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అందజేశారు. పేదల వైద్య సాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

PRABHU, RAZOLE
Published on: 13 Oct 2026 8:57 PM IST
Razole
X

Razole: 51 మందికి రూ.34 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

రాజోలు: రాజోలు నియోజకవర్గానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు రూ.34 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.

గత రెండున్నరేళ్లలో 35 విడతలుగా 1,622 మంది బాధిత కుటుంబాలకు రూ.11.13 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE