Razole: రాజోలు రూ. 4.70 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం

Razole: రాజోలులో రూ.4.70 కోట్ల వ్యయంతో చింతలపల్లి-గుడిమెల్లంక రోడ్డు, కొత్త వంతెనను ప్రారంభించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. స్థానికుల చిరకాల కోరిక తీరింది.

PRABHU, RAZOLE
Published on: 18 July 2026 5:13 PM IST
Razole
X

Razole: రాజోలు రూ. 4.70 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం

రాజోలు: రాజోలు నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. రూ.4 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తయిన చింతలపల్లి–గుడిమెల్లంక వంతెన రోడ్ (కళింగుల రోడ్)తో పాటు విశ్వేశ్వరాయపురం ఆర్‌అండ్‌బీ రోడ్డులోని వేపచెట్టు మీడియం డ్రెయిన్‌పై నూతన వంతెనను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ శనివారం ఘనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

రూ.4 కోట్ల 45 లక్షల వ్యయంతో నిర్మించిన ఐదు కిలోమీటర్ల చింతలపల్లి–గుడిమెల్లంక వంతెన రోడ్, రూ.25 లక్షలతో నిర్మించిన వేపచెట్టు మీడియం డ్రెయిన్ వంతెనతో కలిపి మొత్తం రూ.4 కోట్ల 70 లక్షల విలువైన అభివృద్ధి పనులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా దెబ్బతిన్న చింతలపల్లి–గుడిమెల్లంక రహదారి కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో ప్రయాణం మరింత దుర్భరంగా మారడంతో ఈ రహదారిని పునర్నిర్మించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. నేడు ఆ చిరకాల ఆకాంక్ష నెరవేరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే వేపచెట్టు మీడియం డ్రెయిన్‌పై నూతన వంతెన నిర్మాణం పూర్తవడంతో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, చింతలపల్లి–గుడిమెల్లంక రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం తనకు ఒక సవాల్‌గా మారిందన్నారు. గతంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అప్పటి టెండర్‌ను రద్దు చేసి, ప్రత్యామ్నాయ ప్రాజెక్టు ద్వారా పనులను పూర్తి చేయించామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారిని నేడు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రాజోలు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇతర రహదారుల అభివృద్ధి పనులను కూడా దశలవారీగా పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story