Sakinetipalli: సఖినేటిపల్లి మండలంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పర్యటన
Sakinetipalli: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం, అంతర్వేది కర గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.
Sakinetipalli: సఖినేటిపల్లి మండలంలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పర్యటన
సఖినేటిపల్లి: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ బుధవారం సఖినేటిపల్లి మండలం లోని అంతర్వేదిపాలెం గ్రామం లోని మర్లకొడప(గున్నాలు), అలాగే అంతర్వేది కర గ్రామంలోని దిండకొడప ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
అంతర్వేదిపాలెం గ్రామంలోని చింతావారి తూము, భీరావారి గ్రూప్, కట్టావారి గ్రూప్, మర్లకొడప ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రహదారులు, విద్యుత్ సౌకర్యాలు, డ్రైనేజీతో పాటు ఇతర మౌలిక వసతుల సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం అంతర్వేది కర గ్రామంలోని దిండకొడప ప్రాంతంలో పర్యటించి మంచినీటి సరఫరా, రహదారుల సమస్యలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు.




