Sakhinetipalli: రాయితీ బియ్యం విక్రయాలు.. ప్రారంభించిన రాజోలు ఎమ్మెల్యే
Sakhinetipalli: సఖినేటిపల్లిలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.
Sakhinetipalli: రాయితీ బియ్యం విక్రయాలు.. ప్రారంభించిన రాజోలు ఎమ్మెల్యే
సఖినేటిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తక్కువ ధరకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమం పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అమలు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




