Antarvedi: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి చర్యలు!
Antarvedi: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అభివృద్ధి పనులపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Antarvedi: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి చర్యలు!
Antarvedi: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయ అభివృద్ధి పనులపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సంబంధిత అధికారులతో ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం, గుర్రాలక్క గుడి పునర్నిర్మాణం, కొత్త రథశాల నిర్మాణం, పశు సంరక్షణశాల ఏర్పాటు, కోనేటి నిర్మాణం, నీలకంటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంతో పాటు సముద్ర స్నానాల రేవు సమీపంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి భారీ విగ్రహ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అంతర్వేది క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక పరంగా రాష్ట్రంలోనే విశిష్ట పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పేర్కొన్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.




