Sakhinetipalle: సాగర సంగమంలో రాజోలు ఎమ్మెల్యే పర్యాటకానికి కొత్త శోభ!
Sakhinetipalle: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అంతర్వేదిలో స్పీడ్ బోట్‌లో పర్యటించారు.
Sakhinetipalle: సాగర సంగమంలో రాజోలు ఎమ్మెల్యే పర్యాటకానికి కొత్త శోభ!
సఖినేటిపల్లి: సఖినేటిపల్లి మండలం అంతర్వేది బోట్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్‌లో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి అంతర్వేది బీచ్, ప్రకృతి సోయగాలతో కళకళలాడే మడ అడవులు మరియు ప్రసిద్ధ అన్నాచెల్లెలు గట్టు ప్రాంతాలను సందర్శించారు. సముద్ర తీరంలోని ఆహ్లాదకరమైన వాతావరణం, గోదావరి సంగమ ప్రాంతపు సహజ సౌందర్యం, పచ్చని మడ అడవుల మధ్య బోటు ప్రయాణం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.., అంతర్వేది అనేది ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, సముద్ర తీర సోయగాలు కలిసిన అరుదైన ప్రదేశం. ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడు బీచ్ అందాలు, మడ అడవుల ప్రత్యేకత, ప్రశాంతమైన వాతావరణాన్ని తప్పకుండా ఆస్వాదించాలి అని అన్నారు. అలాగే పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.




