Razole: 61 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Razole: రాజోలులో 61 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 40 లక్షల CMRF చెక్కులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ విశ్వేశ్వరాయపురంలో పంపిణీ చేశారు.
Razole: 61 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Razole: రాజోలు నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మలికిపురం మండలం, విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన 61 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.40 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. అర్హులైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని త్వరితగతిన అందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు.
ఇప్పటివరకు రాజోలు నియోజకవర్గంలో 1,350 బాధిత కుటుంబాలకు రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.




