Malikipuram: గుడిమెళ్ళంకలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!
Malikipuram: మలికిపురం మండలం గుడిమెళ్లంకలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.
Malikipuram: గుడిమెళ్ళంకలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!
Malikipuram: మలికిపురం మండలం గుడిమెళ్ళంక గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు, తక్కువ వోల్టేజీ సమస్యలు తగ్గుతాయని తెలిపారు. రైతులు, గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.




