Razole: డంపింగ్ యార్డ్ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Razole: రాజోలు గ్రామపంచాయతీ పరిధిలోని హెచ్.పీ. గ్యాస్ రోడ్డు శివారులో 2.58 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.
Razole: డంపింగ్ యార్డ్ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Razole: రాజోలు గ్రామపంచాయతీ పరిధిలోని హెచ్.పీ. గ్యాస్ రోడ్డు శివారులో డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ క్షేత్రస్థాయిలో ప్రారంభించారు.
రాజోలు గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు పారిశుద్ధ్యపరమైన ఇబ్బందులు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో చెత్త నిర్వహణ చేపట్టేందుకు డంపింగ్ యార్డ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సర్వే నంబర్లు 175, 176లో మొత్తం 2.58 ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు, కల్వర్టు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసి, డంపింగ్ యార్డ్‌ను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రాజోలు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




