Razole: కోనసీమ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా
Razole: కోనసీమ జిల్లా రాజోలు తాటిపాక వద్ద జాతీయ రహదారిపై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుబడింది.
Razole: కోనసీమ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా
Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం తాటిపాక వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న సుమారు రెండున్నర టన్నుల పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజోలు మండలం ములికిపల్లి గ్రామానికి చెందిన అడబాల సూర్యనారాయణ అలియాస్ అబ్బు అశోక్ లేలాండ్ వాహనంలో ఈ బియ్యాన్ని రావులపాలెం వైపు తరలిస్తున్నాడు. తాటిపాక వద్ద పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బయటపడింది. దీంతో బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, విక్రయించడం, నిల్వ ఉంచడం లేదా రవాణా చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




