Razole: తాటిపాక సెంటర్‌లో రాజోలు పోలీసుల స్పెషల్ డ్రైవ్!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్‌లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 9 Aug 2026 3:32 PM IST
Razole
X

Razole: తాటిపాక సెంటర్‌లో రాజోలు పోలీసుల స్పెషల్ డ్రైవ్!

Razole: బైక్‌లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని భారీ శబ్దాలతో రోడ్లపై హల్‌చల్ చేస్తున్న వాహనదారులకు రాజోలు పోలీసులు షాక్ ఇచ్చారు. “ఇక సౌండ్ చేస్తే చర్యలు తప్పవు” అంటూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బైక్‌లపై కొరడా ఝళిపించారు.

ఆదివారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, తాటిపాక సెంటర్‌లో రాజోలు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ శబ్దాలు చేసే మోడిఫైడ్, లౌడ్ సైలెన్సర్లతో ఉన్న బైక్‌లను గుర్తించారు.

నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన 13 మోడిఫైడ్, లౌడ్ సైలెన్సర్లతో పాటు నెంబర్ ప్లేట్లు సక్రమంగా లేని బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.బైక్‌లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని అధిక శబ్దాలు చేయడం, పబ్లిక్‌లో న్యూసెన్స్‌కు పాల్పడటంపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.

ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అధిక శబ్దాలు చేస్తూ బైక్‌లు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై ఇకపై కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.బైక్ మీది కావచ్చు కానీ రోడ్డుపై సౌండ్‌కు నిబంధనలు వర్తిస్తాయి!” అంటూ రాజోలు పోలీసులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story