Razole: వంతెనపై ఆకతాయిల ఈవ్‌టీజింగ్.. రాజోలు పోలీసుల ముమ్మర నిఘా

Razole: ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై రాజోలు సీఐ వి. సురేష్‌బాబు తక్షణమే స్పందించి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

PRABHU, RAZOLE
Published on: 12 Jun 2026 9:08 PM IST
Razole
X

Razole: వంతెనపై ఆకతాయిల ఈవ్‌టీజింగ్.. రాజోలు పోలీసుల ముమ్మర నిఘా

రాజోలు: గోదావరి నదిపై నిర్మించిన దిండి - చించినాడ వంతెన మరమ్మతు పనుల కారణంగా దాదాపు పదకొండు నెలలుగా భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో కళాశాల,పాఠశాలల విద్యార్థులు తరచూ వంతెనపై నడుచుకుంటూ ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు విద్యార్థినులపై ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువడడంతో రాజోలు సీఐ వి. సురేష్‌బాబు అప్రమత్తమయ్యారు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా వంతెన పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టి పోలీసు సిబ్బందిని మోహరించారు. విద్యార్థులతో మాట్లాడిన సీఐ సురేష్‌బాబు, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు.

అలాగే ఈవ్‌టీజింగ్ లేదా ఇతర వేధింపులకు సంబంధించిన ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story