Razole: రాజోలు 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర'లో గొల్లపల్లి అమూల్య
Razole: రాజోలు శివకోటిలో 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అమూల్య.
Razole: రాజోలు 'స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర'లో గొల్లపల్లి అమూల్య
రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం లోని శివకోటి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీమతి గొల్లపల్లి అమూల్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.
ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహించడం తన బాధ్యత అయితే, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవర్చుకోవాలని సూచించారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా నిర్వహించి, ఎక్కడపడితే అక్కడ చెత్తను పారవేయకుండా ఉండాలని కోరారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
రాజోలులో డంపింగ్ యార్డు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉందని పేర్కొంటూ, దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, శివకోటి గ్రామం మీదుగా వెళ్తున్న హైవేపై కొంతమంది మద్యం సేవించి సీసాలను అక్కడే పడేసి పగులగొడుతున్నారని గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఇటువంటి చర్యలను అరికట్టేందుకు అధికారులతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాజోలు మండల టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి అనుచూరి సునీతా పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి ఆరుమిల్లి భాను సుధాకర్, కట్టా సూరిబాబు, రాజోలు పీఏసీఎస్ అధ్యక్షుడు కసుకుర్తి త్రినాథ స్వామి, మెరుగుమువ్వల ప్రసాద్, ఎంఫీటీసీ బొడ్డు కృష్ణారావు, గ్రామశాఖ అధ్యక్షుడు కడలి ఏడుకొండలు, సెక్రటరీ కమ్మ ప్రసాద్, కడలి నాగేశ్వరరావు (కపిల్), ఆరుమిల్లి రామన్న, కోర్లపాటి వెంకటరమణ, ఉండవల్లి బ్రహ్మాజీ, ముక్కల బాబులు, దొంగ సాయికిరణ్, పితాని చంద్ర, చెల్లుబోయిన నరసింహ, పంచాయతీ కార్యదర్శి అడబాల సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.




