Razole: రాజోలులో గొల్లపల్లి అమూల్య మాస్ ప్లాన్.. ‘కేడర్ విత్ లీడర్’ సక్సెస్!

Razole: రాజోలు తాటిపాక తెదేపా కార్యాలయంలో గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో ‘కేడర్ విత్ లీడర్’ కార్యక్రమం.

PRABHU, RAZOLE
Published on: 15 May 2026 4:27 PM IST
Razole
X

Razole: రాజోలులో గొల్లపల్లి అమూల్య మాస్ ప్లాన్.. ‘కేడర్ విత్ లీడర్’ సక్సెస్!

రాజోలు: రాజోలు మండలం తాటిపాక లోని తెదేపా పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి, రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక "కేడర్ విత్ లీడర్" కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముందుగా

డెల్టా ఆర్కిటెక్ట్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి అమూల్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..కాటన్ దొర భారతదేశంలో అనేక ఆనకట్టలు మరియు కాలువలను నిర్మించిన ఒక గొప్ప బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్ అని, ఆయన నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ ఎంతో దృఢంగా ఉన్నాయని, ముఖ్యంగా మన గోదావరి డెల్టా సస్యశ్యామలం కావడానికి మరియు దక్షిణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకోవడానికి ఆయన కట్టడాలు ఎంతో దోహదపడ్డాయని అటువంటి మహానీయుని గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.

ఈసందర్భంగా కేడర్ విత్ లీడర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... మన కూటమి ప్రభుత్వం పెద్దలు ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రముగా నిలపడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అలా చూసుకుంటే ఈరోజు రాయలసీమలో దేశ రక్షణకు ఉపయోగపడే యుద్ధ విమానాల తయారీ యూనిట్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్రమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషదాయకం అని అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు కూటమి శ్రేణుల నుండి అర్జీలను నాయకులతో కలిసి స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు సాయిబాబా రాజు, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు లంకే శ్రీనివాసరావు, సఖినేటిపల్లి మండల పార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, మలికిపురం మండలం పార్టీ అధ్యక్షులు అడబాల సాయిబాబా, రాజోలు మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి అనుచూరి సునీత, మామిడికుదురు మండలం పార్టీ అధ్యక్షులు బోణం బాబు, ఉండ్రు శ్రీరామారావు, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గొనిపాటి రాజు, పిల్లి శ్రీరామ్మూర్తి, ఆరుమిల్లి భాను, విత్తనాల జానకిరామ్, కోటిపల్లి రత్నమాల,చింతా లక్ష్మి, చింతపల్లి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story