Razole: సోంపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి
Razole: సోంపల్లి హైవే వద్ద మైనర్ నడుపుతున్న బైక్ ఢీకొని కొల్లు పూజ (29) అనే వివాహిత మృతి. రాజోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం.
Razole: సోంపల్లి హైవేపై రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి
రాజోలు: డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి సమీపంలోని హైవే రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కొల్లు పూజ (29) అనే వివాహిత మృతి చెందారు.
భర్తతో కలిసి తాటిపాక వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మైనర్ నడుపుతున్న బైక్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పూజ రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది.
స్థానికులు వెంటనే ఆమెను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటి సమీపంలోనే జరిగిన ఈ ప్రమాదంతో సోంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
Next Story




