Razole: రాజోలులో వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ మంత్రి నారా లోకేష్!
Razole: వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై భారీ బైక్ ర్యాలీ. సీబీఐ విచారణ జరిపించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Razole: రాజోలులో వైఎస్సార్‌సీపీ భారీ బైక్ ర్యాలీ మంత్రి నారా లోకేష్!
Razole: డీఎస్సీ అక్రమాలపై న్యాయ విచారణ జరిపి, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
రాజోలు మండలం శివకోటి గ్రామంలోని గ్రామదేవత శ్రీ ముసలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు.శివకోటి నుంచి రాజోలు మీదుగా తాటిపాక నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ కొనసాగింది.
మార్గమధ్యంలో కనిపించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాముల రాజేశ్వరి దేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు.
డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.




