Rajahmundry: పార్టీ అవకాశమిస్తే సర్పంచ్‌గా పోటీ: ముమ్మిడి దేవీనాగేశ్వరరావు
Rajahmundry: పార్టీ అవకాశం ఇస్తే దుళ్ళ సర్పంచ్‌గా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందుతానని తెలుగుయువత నేత ముమ్మిడి దేవీనాగేశ్వరరావు ప్రకటించారు.
Rajahmundry: పార్టీ అవకాశమిస్తే సర్పంచ్‌గా పోటీ: ముమ్మిడి దేవీనాగేశ్వరరావు
Rajahmundry: సర్పంచ్‌గా అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ తరపున దుళ్ళ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలుగుయువత నాయకుడు ముమ్మిడి దేవీనాగేశ్వరరావు తెలిపారు.
మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పార్టీకోసం నిస్వార్ధంగా పనిచేసిన కొందరిలో తానూ ఒకడినని, పార్టీ తరపున అవకాశం ఇస్తే గెలుపునకు తన శాయశక్తులా ప్రయత్నించి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేసారు.
గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించానన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి గారికి గ్రామంలో మెజార్టీ ఓట్లు సాధించంలో స్థానిక నాయకులతో కలిసి కృషి చేసానన్నారు.
అలాగే గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల్లోనూ తనకు మద్దతు ఉందని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా దుళ్ళ గ్రామంలో పటిష్టమైన ఓటుబ్యాంకు ఉందని, వారి మద్దతుతో తాను విజయం సాధిస్తానని దేవీ నాగేశ్వరరావు చెప్పారు.




