Konaseema: కోనసీమ కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Konaseema: కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పాల్గొని 195 అర్జీలను స్వీకరించారు.
Konaseema: కోనసీమ కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Konaseema: అర్జీలను నాణ్యతతో పాటు నిర్దేశిత సమయానికి పరిష్కార మార్గాలు చూపాలని పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీలను జవా బుదారీతనంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్డిఓ జి మమ్మీ, డి ఆర్ డి ఎ పి డి రాంబాబు, ఎస్ డి సి: పి కృష్ణమూర్తి, డిఎల్డిఓలు అర్జీదారుల నుండి సుమారుగా 195 అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిజిఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో హేతుబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. ఆర్జీలను సమగ్రంగా పరిశీలించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను త్వరితగతిన సకాలంలో చూపాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, సమర్థత పాటించడం ఆత్యంత ముఖ్యమన్నారు. ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు సకాలంలో సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్జీలు పరిష్కార దిశగా పనిచేయడం అత్యంత ప్రధానమన్నారు అర్జీల పట్ల సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు ఫిర్యాదులను అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి రీఓపెనింగ్ కు ఆస్కారం లేకుండా పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.




