Rampachodavaram: రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!
Rampachodavaram: సిరిగిందలపాడులో రాజమండ్రి రామకృష్ణ మిషన్ ఉచిత వైద్య శిబిరం. 150 మంది గిరిజనులకు వైద్య సేవలు, పరీక్షలు, ఉచితంగా అన్నదానం నిర్వహణ.
Rampachodavaram: రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం!
Rampachodavaram: రామ కృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్య శాల రాజమండ్రీ వారి అధ్వర్యంలో పోలవరం జిల్లా, రంపచోడవరం మండలం, సిరిగిందలపాడు లో ఆదివారం వైద్య శిభిరం నిర్వహించినట్లు రామ కృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహారాజ్ తెలియచేసినారు.
ఈ వైద్య శిభిరం లో సుమారు 150 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తేలియచేసినారు ఈ వైద్య శిభిరం లో డాక్టర్ శ్రీనివాస్ రాయుడు , డాక్టర్ దాసరి ఉమా మహేష్ , డాక్టర్ పావని ప్రియ , డాక్టర్ వెలమ స్నేహా మాధురి సుమారు 150 మందికి వైద్య సేవలు. అందించారు.
ఈ వైద్య శిభిరం లో పాల్గొన్నరోగులకు 46 మందికి రక్తపరీక్షలు, 8 మందికి కి థైరాయిడ్ పరీ క్షలు , , 1 కీ ECG, 11 మందికి physiotherapy చేసినట్లు స్వామీజి తెలిపినారు రోగులకు, సహాయకులు కు అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి రక్త పోటు (బి.పి ) మధుమేహం (షుగర్ ) , థైరాయిడ్ వ్యాధులు పై డాక్టర్ పావని , డాక్టర్ స్నేహా మాధురి అవగాహన కలిగించారు , ఆలాగే వర్షాకాలం లో వచ్చే వ్యాధులు గురించి, తీసుకోవలసిన జాగ్రాత్తలను చక్కగా వివరించారు రామక్రిష్ణ మిషన్ సిబ్బంది , వైద్యసేవల సమన్వయ కర్త కానుమోను శ్రీనివాస్ , రామకృష్ణ మిషన్ సిబ్బంది వాలంటీర్ గిరిరాజ్ కృష్ణ పాల్గొన్నారు.




