Chintoor: ఎన్‌హెచ్-30 పై ఘోర ప్రమాదం: లారీ-కారు ఢీ.. ఇద్దరు మృతి!
Chintoor: పోలవరం/అల్లూరి జిల్లా చింతూరు పరిధిలో జాతీయ రహదారి 30పై లారీ-కారు ఢీకొని కారు పూర్తిగా దగ్ధమైంది.
Chintoor: ఎన్‌హెచ్-30 పై ఘోర ప్రమాదం: లారీ-కారు ఢీ.. ఇద్దరు మృతి!
చింతూరు: పోలవరంజిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం - విద్యానగరం గ్రామాల మధ్య గల జాతీయ రహదారి 30 పై శుక్రవారం రాత్రి లారీ,కారు ఢీ కున్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.కార్లో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు సజీవ దహనం అయ్యారు.
మరొకరు వైద్యం పొందుతూ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే భద్రాచలం నుండి కారులో ఇద్దరు వ్యక్తులు చింతూరు వైపు వస్తున్నారు.అలాగే ఒరిస్సా రాష్ట్రం నుండి వయా చింతూరు మీదుగా భద్రాచలం వైపు ఓ లారీ వెళ్తుంది. బొడ్డుగూడెం - విద్యానగరం గ్రామాల మధ్య గల జాతీయ రహదారి 30 మూలమలుపు వద్ద రెండు వాహనాలు ఢీ కొట్టుకున్నాయి.
ఈ ప్రమాదంలో లారీ కారును కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్ళింది ఈ సమయంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు సజీవ దహనం అయ్యారు. మరొకరు భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో వైద్యం పొందుతూ మృతి చెందాడు.
ప్రమాద విషయం తెలుసుకున్న చింతూరు సిఐ గోపాలకృష్ణ హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉందని సీఐ గోపాలకృష్ణ తెలిపారు.




