Amalapuram: అమలాపురం 28వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన!
Amalapuram: అమలాపురం 28వ వార్డు దుడ్డివారి అగ్రహారంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.
Amalapuram: అమలాపురం 28వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన!
అమలాపురం: అమలాపురం పట్టణం 28వ వార్డు పరిధిలోని దుడ్డివారి అగ్రహారంలో సుమారు రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఈ రోజు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని,ప్రతీ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
ప్రజల దశాబ్దాల కలలైన రోడ్లు,డ్రెయిన్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని,నాణ్యతా ప్రమాణాలతో పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను,కాంట్రాక్టర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి కార్యకర్తలు,నాయకులు, ప్రజాప్రతినిధులు,అధికారులు మరియు వార్డు సభ్యులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




