Nidadavole: నిడదవోలు అభివృద్ధికి రూ. 45 కోట్ల హెచ్‌ఏఎం (HAM) నిధులు!
Nidadavole: నిడదవోలు పట్టణాభివృద్ధికి రూ. 45 కోట్ల హెచ్‌ఏఎం నిధులు మంజూరైనట్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి.
Nidadavole: నిడదవోలు అభివృద్ధికి రూ. 45 కోట్ల హెచ్‌ఏఎం (HAM) నిధులు!
Nidadavole: రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలులో నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో మంత్రి పలు అభివృద్ధి అంశాలపై మాట్లాడారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.5,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా నిడదవోలు పట్టణానికి రూ.45 కోట్ల నిధులు మంజూరయ్యాయని, పార్కులు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తన మంత్రి హోదాలో నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.500 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని దుర్గేష్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమకూర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధునిక రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజన్‌కు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. అమృత్ భారత్ 2.0 పథకం ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
డీఎస్సీ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి విమర్శలు చేశారు. డీఎస్సీ విషయంలో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడుతోందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తిగారు, జన సైనికులు,వీర మహిళలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




