Chintoor: చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షాలు.. ఉప్పొంగుతున్న శబరి నది!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న శబరి నది, సోకిలేరు వాగు. చింతూరు వద్ద 27 అడుగులకు చేరిన శబరి నీటిమట్టం.
Chintoor: చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షాలు.. ఉప్పొంగుతున్న శబరి నది!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గత రెండు రోజుల నుండి కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో శబరి నదిలో నీరు భారీగా చేరి ఉదృతంగా ప్రవహిస్తుంది. శబరి నదికి అనుసంధానమైన సోకిలేరు, కుయుగురు చంద్రవంక వాగులు పొంగి పొర్లుతున్నాయి.
ముకునూరు గ్రామాల మధ్య గల సోకిలేరు వాగు పరవళ్ళు తొక్కుతూ రహదారి పైకి ఎక్కి ప్రవహిస్తుంది. వరద మరింత ఉధృతి పెరిగితే చింతూరు నుండి విఆర్ పురం మండలాలకు రాకపోకలు స్తంభించనున్నాయి.
ప్రస్తుతం జలమయం అయిన రహదారి పైనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు.శబరి ఉదృతి పెరుగుతుండడంతో శబరి నీటిమట్టం చింతూరు వద్ద 27 అడుగులకు చేరుకొని ప్రవహిస్తుంది.




