Razole: దిండి–చించినాడ బ్రిడ్జిపై భద్రత పెంచాలని ప్రజల విజ్ఞప్తి!

Razole: దిండి–చించినాడ బ్రిడ్జిపై పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు ఎత్తైన ఇనుప మెష్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాజోలు ప్రజల విజ్ఞప్తి.

PRABHU, RAZOLE
Published on: 7 Sept 2026 2:58 PM IST
Razole
X

Razole: దిండి–చించినాడ బ్రిడ్జిపై భద్రత పెంచాలని ప్రజల విజ్ఞప్తి!

Razole: రెండు జిల్లాలను కలిపే దిండి–చించినాడ బ్రిడ్జి ఇటీవల కాలంలో తరచూ ఆత్మహత్యలకు వేదికగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ వారధి క్షణికావేశంలో మనుషులు తీసుకునే ప్రాణాంతక నిర్ణయాలకు కేంద్రంగా మారడం తీవ్ర ఆవేదన కలిగించే అంశంగా మారింది.

కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు తదితర కారణాలతో క్షణికావేశానికి లోనై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు స్థానికులను కలవరపెడుతున్నాయి. రెండు జిల్లాలను అనుసంధానించే ఈ బ్రిడ్జి రెండు ప్రాణాలను కలిపే వారధిగా ఉండాలి కానీ, ప్రాణాలను తీసుకునే వేదికగా మారకూడదు.

ఆత్మహత్యలను నివారించేందుకు బ్రిడ్జికి ఇరువైపులా మరింత ఎత్తైన, పటిష్టమైన ఇనుప మెష్‌ను ఏర్పాటు చేయాలని ఇరు జిల్లాల ప్రజలు, ప్రజాసంఘాలు, రాష్ట్ర ప్రజానీకం కోరుతున్నారు. అవసరమైతే సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో తగిన భద్రతా చర్యలు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజాప్రతినిధులారా ఉన్నతాధికారులారా ఇకనైనా తక్షణమే స్పందించండి. ఒక్క ప్రాణాన్ని కాపాడినా అది ఎంతో విలువైన మానవీయ విజయం. దిండి–చించినాడ బ్రిడ్జిని ఆత్మహత్యలకు అడ్డాగా కాకుండా, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే వారధిగా మార్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story