Sakhinetipalli: మిత్రుడి కుటుంబానికి 2006 టెన్త్ బ్యాచ్ అండ.. రూ.76 వేల సాయం
Sakhinetipalli: రోడ్డు ప్రమాదంలో మరణించిన స్నేహితుడు సురేష్ కుమార్తె పేరిట సఖినేటిపల్లి లూధరన్ హైస్కూల్ 2006 టెన్త్ బ్యాచ్ మిత్రులు రూ.76 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.
Sakhinetipalli: మిత్రుడి కుటుంబానికి 2006 టెన్త్ బ్యాచ్ అండ.. రూ.76 వేల సాయం
సఖినేటిపల్లి: సఖినేటిపల్లి లూధరన్ హైస్కూల్‌లో 2006 టెన్త్ క్లాస్ బ్యాచ్‌కు చెందిన స్నేహితుడు చొప్పల సురేష్ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్నేహితుడి అకాల మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆయనతో కలిసి చదువుకున్న తోటి మిత్రులు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా గోనమండ విజయ రత్నం, సహదేవ్ తాడి, రావి అజయ్ బాబు, కాసాని వెంకటేశ్వర్లు, చిటికెన గంగరాజు, తోటే ఉదయ్ కిరణ్, గొల్లమందల జీవన్ కుమార్, నరేష్ వేమవరపు, గొల్ల రాఖి, రావి సురేంద్ర తదితరులు కలిసి రూ.76,000/- (డెబ్బై ఆరు వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
చొప్పల సురేష్ కుమార్తె పేరుతో స్థానిక పోస్ట్ ఆఫీస్‌లో రూ.76 వేల మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, ఆర్థిక భద్రతకు తోడ్పాటుగా అందించారు. స్నేహితుడి కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తూ, కష్టకాలంలో అండగా నిలిచిన మిత్రుల సేవాభావాన్ని పలువురు అభినందించారు.
స్నేహబంధం కేవలం చదువుకున్న రోజులకే పరిమితం కాకుండా, జీవితంలోని కష్టసుఖాల్లోనూ తోడుగా నిలవాలనే సందేశాన్ని ఈ ఆర్థిక సహాయం చాటిచెప్పింది.




