Sakhinetipalli: ఉయ్యూరివారిమెరకలో గొల్లపల్లి అమూల్య ఇంటింటికీ ప్రచారం

Sakhinetipalli: సఖినేటిపల్లి మండలంలో గొల్లపల్లి అమూల్య ఇంటింటి ప్రచారం. కూటమి రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించిన రాజోలు ఇన్‌చార్జి.

PRABHU, RAZOLE
Published on: 29 July 2026 2:25 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: ఉయ్యూరివారిమెరకలో గొల్లపల్లి అమూల్య ఇంటింటికీ ప్రచారం

సఖినేటిపల్లి: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనసేన పార్టీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" డోర్ టూ డోర్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం లోని ఉయ్యూరివారి మెరక, అంతర్వేదిపాలెం గ్రామాల్లో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి గొల్లపల్లి అమూల్య ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమైన శ్రీమతి అమూల్య, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. తమ సమస్యలు, సూచనలను ఆమె దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీమతి గొల్లపల్లి అమూల్య, ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన టీడీపీ–బీజేపీ –జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞ నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా నిబద్ధత, కేంద్రంలోని బీజేపీ నాయకత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల విస్తరణ, గ్రామీణ రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, విద్య, వైద్యం, వ్యవసాయ రంగ బలోపేతం వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన పురోగతి సాధించిందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే, జవాబుదారీతనం కలిగిన పారదర్శక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

"రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమం కేవలం ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేయడానికే కాకుండా, ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని పాలనను మరింత ప్రజాకేంద్రీకృతంగా తీర్చిదిద్దేందుకు వేదికగా నిలుస్తోందని ఆమె వివరించారు. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చాలని పిలుపునిచ్చారు.

రాజోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తానని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు శ్రీమతి గొల్లపల్లి అమూల్య స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతి రాజు ఈశ్వరరాజు వర్మ, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చినబాబు రాజు, మండల పార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి పప్పుల రమేష్‌తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story