Sakhinetipalli: ఉపాధి హామీ మేట్స్ ఆందోళన: సఖినేటిపల్లిలో నిరసన

Sakhinetipalli: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సఖినేటిపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ మేట్స్ ఆందోళన చేపట్టారు; పరిష్కరించకుంటే సమ్మె హెచ్చరిక.

PRABHU, RAZOLE
Published on: 5 Oct 2026 4:47 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: ఉపాధి హామీ మేట్స్ ఆందోళన: సఖినేటిపల్లిలో నిరసన

సఖినేటిపల్లి: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సఖినేటిపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ మేట్స్ సోమవారం నిరసన చేపట్టారు. విధుల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా తమపై పనిభారం పెంచడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి మేట్‌కు సెల్‌ఫోన్ సౌకర్యం కల్పించడంతో పాటు, రీఛార్జ్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. పని దినాలతో సంబంధం లేకుండా విధులు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరారు.

మేట్స్ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేయడంతో పాటు విధులను బహిస్కరిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE