Sakhinetipalli: సఖినేటిపల్లిలో రూ.55.30 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
Sakhinetipalli: సఖినేటిపల్లిలో పుష్కరాల నిధులు రూ.55.30 లక్షలతో చేపట్టనున్న 4 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు.
Sakhinetipalli: సఖినేటిపల్లిలో రూ.55.30 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన
సఖినేటిపల్లి: పుష్కరాల నిధులతో సఖినేటిపల్లి గ్రామంలో రూ.55.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నాలుగు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. మొత్తం 850 మీటర్ల మేర ఈ రోడ్లను నిర్మించనున్నారు.
ఆంజనేయస్వామి ఆలయం నుంచి బాడిరేవు వంతెన వరకు 470 మీటర్ల మేర రూ.27 లక్షలతో, ఆంజనేయస్వామి ఆలయం నుంచి పుష్కర ఘాట్ వరకు 150 మీటర్ల మేర రూ.11 లక్షలతో, గీతా మందిరం వద్ద రైతు భరోసా కేంద్రం నుంచి పుష్కర ఘాట్ వరకు 120 మీటర్ల మేర రూ.9.30 లక్షలతో, సఖినేటిపల్లి పల్లిపాలెంలో పొన్నమండ గంగరాజు ఇంటి నుంచి పుష్కర రోడ్డు వరకు 110 మీటర్ల మేర రూ.8 లక్షలతో పనులు చేపట్టనున్నారు.
పుష్కరాలకు తరలివచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడేలా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సఖినేటిపల్లి పల్లిపాలెం ప్రాంతంలో పర్యటించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




