Sakinetipalli: రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి - ఎమ్మెల్యే

Sakinetipalli: సఖినేటిపల్లిలో రెవెన్యూ అధికారులతో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్ష. అన్‌అబ్జెక్షనబుల్‌ ల్యాండ్లు, అంతర్వేది ఆలయ భూముల నివాసితుల పట్టాలపై స్పష్టమైన ఆదేశాలు.

PRABHU, RAZOLE
Published on: 4 Sept 2026 8:09 PM IST
Sakinetipalli
X

Sakinetipalli: రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి - ఎమ్మెల్యే

సఖినేటిపల్లి: సఖినేటిపల్లి మండలంలోని రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. సఖినేటిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

మండలంలోని గ్రామాల్లో అర్హత కలిగిన వారికి నిబంధనల ప్రకారం అన్‌అబ్జెక్షనబుల్‌ ల్యాండ్లకు పొజిషన్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటికలకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూముల్లో చాలాకాలంగా నివాసం ఉంటున్న వారిలో అర్హులను గుర్తించి, నిబంధనల ప్రకారం పట్టాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు. ప్రజల రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story