Sakinetipalli: సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై గ్రామస్తులకు పోలీసుల అవగాహన!
Sakinetipalli: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి లంక గ్రామంలో పోలీసులు 'పల్లె నిద్ర' కార్యక్రమం నిర్వహించారు.
Sakinetipalli: సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై గ్రామస్తులకు పోలీసుల అవగాహన!
Sakinetipalli: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసులు "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వి. సురేష్ బాబు, ఎస్సై దుర్గా శ్రీనివాస్ గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. అలాగే రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, గల్ఫ్ కి వెళ్లే వారు నఖిలీ ఏజెంట్ లను నమ్మి మోసపోవడం, ఈవ్ టీజింగ్ నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు.
ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.




