Rajahmundry: గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళి!

Rajahmundry: సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు ప్రముఖులు ఘన నివాళులర్పించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 16 Aug 2026 11:26 PM IST
Rajahmundry
X

Rajahmundry: గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళి!

రాజమండ్రి: స్వాతంత్య్ర సమర యోధుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ మంత్రి సర్ధార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు రాజమహేంద్రవరం వై-జంక్షన్ వద్ద నున్న ఆయన విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కాంస్య విగ్రహ వ్యవస్ధాపక అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగర గౌడ, శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు సూరంపూడి శ్రీహరి, మార్గాని చంటిబాబు, ఇతర కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,

వైసిపి అమలాపురం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, జనసేన సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, వైసిపి పార్లమెంట్ ఇన్‌చార్జ్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, ఎఎంసి చైర్మన్ మార్ని వాసుదేవ్, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్‌కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కాంగ్రెస్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, బిసివై పార్టీ పిఎసి సభ్యుడు అత్తిలి రాజు, ఇతర నాయకులు కొండేటి భీమారావు, పిల్లి నిర్మల, గుమ్మడి సమర్పణరావు, దేశిరెడ్డి బలరామ నాయుడు, సానబోయిన రామారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, జార్జ్ అంధోని, కడలి రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు.

ఆనాడు జాతిపిత మహాత్మాగాంధీ పిలుపును అందుకున్న స్వాతంత్య్ర సమరోద్యంలో ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, హరిజనుల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వల్లభాయ్ పటేల్ తరువాత సర్ధార్ పిలుపు అందుకున్న నాయకుడు గౌతు లచ్చన్న మాత్రమేనని తెలిపారు. ఆయన స్ఫూర్తితో నేటి తరం రాజకీయ నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత సామాజిక వర్గాల మధ్య ఐక్యత సాధించడానికి అనునిత్యం కృషిచేసారని ప్రశంసించారు. అటువంటి మహనీయుడి ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని కోరారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని బుడ్డిగ శ్రీనివాస్ వెల్లడించారు. అది గౌతు లచ్చన్నతో పాటు తమ సామాజిక వర్గాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

సంఘం ఉపాధ్యక్షుడు గేడి అన్నపూర్ణ రాజు, కోశాధికారి గెద్దాడ హరిబాబు, వనుము శ్రీనివాస్, రేలంగి శేఖర్, సంఘం పెద్దలు కడియాల వరబాబు, శీలం గోవింద్, కుడుపూడి పార్ధసారధి, అనుసూరి పద్మలత, గొర్రెల రమణ, పెంకే సురేష్, సూరంపూడి అప్పారావు, సూరంపూడి రాజేంద్ర, కడలి చిన్న, గుత్తుల రామచంద్రరావు, కట్టా మల్లేశ్వరరావు, కడలి కెరటాలు, టేకుమూడి బద్రీనాధ్, సూరంపూడి వీరవెంకట రావు, మార్కొండ సుబ్రహ్మణ్యం, కార్పొరేషన్ డైరెక్టర్లు యామన నారాయణ గౌడ్, పిల్లి వెంకట రమణ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story