Seethanagaram: గుచ్చిమిలో ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Seethanagaram: సీతానగరం గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏనుగుల శిబిరాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హాజరైన మంత్రి గుమ్మడి సంధ్యారాణి.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 29 July 2026 4:19 PM IST
Seethanagaram
X

Seethanagaram: గుచ్చిమిలో ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

సీతానగరం: గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన ఏనుగుల శిబిరాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.గుచ్చిమి ఏనుగుల శిబిరంలో ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్పు తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తదితరులు..

మంత్రి గుమ్మడి సంధ్యారాణి కామెంట్స్...గజరాజులను ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆనందదాయకం.జిల్లాలో ఉన్న సమస్యల్లో ప్రధాన సమస్య ఏనుగుల సమస్య ఎన్నో ఏళ్లుగా జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ, పంట నష్టాన్ని కలిగిస్తూ చంచరిస్తున్న అడవి ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం.

ఏనుగుల దాడిలో ఇప్పటివరకు సుమారు 13 మంది మృతి చెందారు అనేక ఎకరాల్లో పంటను నాశనం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.డిప్యూటీ సీఎం స్పందించి జిల్లా ప్రజల కష్టాలను తీర్చేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకువచ్చి సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు చెప్పిన మాట ప్రకారం అటవీ ఏనుగుల బారి నుంచి జిల్లా ప్రజలను రక్షించేందుకు జయంత్, అభిమన్యు అనే కుంకి ఏనుగులను జిల్లాకు పంపించారు.కుంకి ఏనుగుల సహాయంతో అడవి ఏనుగులను సంరక్షణ కేంద్రానికి లేదా అడవిలోకి పంపించి ఏనుగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం

ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఈరోజు బీజం వేయడం సంతోషదాయకం.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమాట ప్రకారం కుంకి ఏనుగులను పంపించారు.కుంకి ఏనుగులను ఏ నియోజకవర్గం తీసుకెళ్లినా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వండి కుంకి ఏనుగులతో సాయంతో అడవి ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తీసుకు వస్తాం.

ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటాం అంతర్జాతీయ విమానాశ్రయం బాగాపురంలో ప్రారంభించడం వల్ల మారుమూలన ఉన్న మన్యం జిల్లా అందాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఒక అవకాశం.ఎంతో సుందరంగా కొండలు లోయలతో ఉన్న జిల్లాను పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతాం.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story