Razole: జాతీయ రహదారిపై మద్యం సీసాల పెంకులు.. ద్విచక్ర వాహనదారుల విలవిల
Razole:డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి బైపాస్ రహదారిపై పెద్ద ఎత్తున మద్యం సీసాల పెంకులు పేరుకుపోయాయి.
Razole: జాతీయ రహదారిపై మద్యం సీసాల పెంకులు.. ద్విచక్ర వాహనదారుల విలవిల
రాజోలు: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం శివకోటి సమీపంలోని బైపాస్ రహదారిపై పెద్ద ఎత్తున ఖాళీ బ్రాందీ, బీరు సీసాలు రోడ్డుపై పడి పగిలిపోయి చిందరవందరగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాహనాలు సీసాలపై నుంచి వెళ్లడంతో అవి పగిలిపోయి, రహదారి మొత్తం గాజు పెంకులతో నిండిపోయింది. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ఉన్న గాజు పెంకులను తొలగించి, ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు
Next Story




